Header Banner

ఉమెన్స్ డే సందర్భంగా సీఎం ఆయన భార్య భువనేశ్వరి కోసం ప్రత్యేకమైన గిఫ్ట్! అది ఏంటో తెలుసా..!

  Sat Mar 08, 2025 17:43        Politics

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వ్యాపారం ఎలా సాగుతోందమ్మా? అని ఆరా తీశారు. పర్యావరణ హిత విధానంలో గుడ్డ సంచులు వాడుతుండడం పట్ల ఆ స్టాల్ వారిని చంద్రబాబు అభినందించారు. ఈ క్రమంలోనే ఓ చీరల స్టాల్ ను కూడా సీఎం సందర్శించారు. మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఆయన భార్య భువనేశ్వరి కోసం ఓ పట్టుచీరను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగానే చీర రూ.26,400 అని చెప్పగా.. రూ.25 వేలకు బేరం ఆడి కొనుగోలు చేశారు. అంతే కాకుండా మార్కాపురంలో జ‌రిగిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని సీఎం ధరించారు. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన శక్తి యాప్‌ను కూడా చంద్రబాబు ప్రారంభించారు. అలానే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!


ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామన్నారు చంద్రబాబు. గుర్రపుడెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా మంచి ఆదాయం వస్తుందన్నారు. దీనిపై మహిళలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలని కోరారు. అంతే కాకుండా మహిళా రైడర్లను కూడా ప్రోత్సహిస్తామన్నారు. ఈ సంద‌ర్భంగా ర్యాపిడో మ‌హిళా డ్రైవ‌ర్ల‌ను అభినందించారు. ప్రధాన నగరాల్లో వెయ్యి మంది మహిళా రైడర్లకు 760 ఈ-బైక్లు, 240 ఈ-ఆటోలు అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఇక ప్రతిఒక్కరూ ఆర్థిక స్వావలంబన సాధించాల‌నే ఉద్దేశంతో ఏడాదిలో లక్షమంది పారిశ్రామికవేత్తలు తయారు కావాలన్నదే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. మహిళలు శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ సంపాదనలో పురుషులను మించిపోతున్నారని అన్నారు. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే 2023-24 ప్రకారం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. మహిళల కోసం వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని తీసుకువస్తున్నామని వెల్లడించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #APCM #womensday #gift #bhuvaneswari #todaynews #flashnews #latestnews